నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. నాకు ఏడాదిన్నర వయస్సులో ఉండగా పోలియో వ్యాధి వచ్చి రెండు కాళ్ళు, కుడి చెయ్యి పోగొట్టుకున్నాను. నేలపై ప్రాకుతూ కదులుతాను. ఈ పరిస్తితుల్లో కూడా నేను పడ్డ శ్రమలు ఇన్ని అన్ని కావు. నడవలేని పరిస్థితిలో నరక యాతన అనుభవిస్తున్నాను. ఈ స్థితిలోనే ఉంటూ బి.కాం. బి.ఇది:బి.ఏ.స్పెషల్ ఇంగ్లీష్:ఏం.ఏ.(హిస్టరీ) చదివాను. చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చాలా మంది "చదువుకుని ఉపయోగమేముంది, నడవలేని వాడు ఏమి ఉద్యోగం చేస్తాడు? అతడిని ఎవరు ఉద్యోగంలో పెట్టుకుంటారు? " అని ఎగతాళి చేసారు. మనసులో పైకి చెప్పుఉకోలేని బాధ, ఎవరు తీర్చగలరు ?
అయితే నేను దేవుణ్ణి నమ్ముతాను. అందరి అంచనాలకు అతీతంగా ఉద్యోగం ఐతే సాధించాను. అందులో త్రుప్తి మాత్రం పొందలేక పోయాను. నా వంటి వికల్లాంగులకు సహాయపడాలనే తీవ్రమైన కోరిక నాలో నాలో ఎప్పుడూ మండుతూ ఉంటుంది. ఆ ప్రయత్న ఫలితమే ఈ వేదిక. దేవుడు మరియు మానవత్వం ఉన్న ప్రజలు తోడ్పడితే ఘన విజయం తప్పక సాధించగలనని గట్టిగా నమ్ముతున్నాను.
ఇట్ట్లు
మీ వికలాంగ ఆశిబాబు.